ePaper
Monday, August 3, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణవరంగల్పెద్ది సుదర్శన్ రెడ్డికి అడ్వకేట్ గంధంశివ "అశ్రునివాళి"

పెద్ది సుదర్శన్ రెడ్డికి అడ్వకేట్ గంధంశివ “అశ్రునివాళి”

📰 Generate e-Paper Clip

-ఆత్మీయతను పంచిన అన్నను కోల్పోవడం తీరని లోట

జనోదయ వరంగల్ ప్రతినిధి: జులై 31

బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే, తెలంగాణ ఉద్యమకారుడు పెద్ది సుదర్శన్ రెడ్డి మృతి పట్ల అడ్వకేట్ గంధంశివ నివాళులర్పించారు.

నల్లబెల్లి లోని పెద్ది సుదర్శన్ రెడ్డి స్వగృహానికి చేరుకున్న గంధంశివ కుటుంబ సభ్యులను పరామర్శించి, పార్థివదేహానికి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా గంధంశివ భావోద్వేగంతో మాట్లాడుతూ.. “తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పనిచేసి, ప్రజల కోసం జీవించిన పెద్ది సుదర్శన్ రెడ్డి అన్నను కోల్పోవడం మాకు తీరని లోటు. నన్ను ఎంతో అభిమానించి, తన ప్రేమపూర్వక మనసుతో ఆత్మీయతను పంచిన పెద్ది అన్న జ్ఞాపకాలు ఎప్పటికీ మా గుండెల్లో ఉంటాయి. ప్రతి కష్టంలోనూ అండగా నిలిచిన ఆయన ఆదరణను జీవితాంతం మర్చిపోలేను” అంటూ కన్నీటి భాష్పాంజలి ఘటించారు. తెలంగాణ ఉద్యమంలో పెద్ది సుదర్శన్ రెడ్డి పోషించిన పాత్ర చరిత్రలో నిలిచిపోతుందని, ప్రజా నాయకుడిగా ఆయన చేసిన సేవలు మరువలేనివని గంధంశివ కొనియాడారు. పెద్ది సుదర్శన్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబానికి ఈ విషాదాన్ని తట్టుకునే శక్తిని భగవంతుడు ప్రసాదించాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని నివాళులర్పించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular