-10 వేల నగదు 1 లక్ష బీమా సహాయం
జనోదయ: వరంగల్ ప్రతినిధి: ఆగస్టు 04
బాలాజీ నగర్‌లో ప్రమాదవశాత్తు మృతి చెందిన సిలువేరు అనిల్ కుటుంబానికి త్రిచక్ర పొదుపు మరియు పరస్పర సహాయక సహకార సంఘం అండగా నిలిచింది.
సంఘం అధ్యక్షులు ఇసంపెల్లి సంజీవ, డైరెక్టర్లు మడికొండ బాబు, కలకోట్ల జయరాం, పసునూరి బాబు, సభ్యులు దొడ్డరాజు, చింత రమేష్ కుమార్ మంగళవారం అనిల్ కుటుంబాన్ని పరామర్శించారు.
ఈ సందర్భంగా అనిల్ భార్య గౌరిక, కుమార్తె విశ్వాంతిక, కుమారుడు విన్నును ఓదార్చారు.
ఆకస్మికంగా కుటుంబ పెద్దను కోల్పోయిన కుటుంబానికి అండగా సంఘం తరపున అంత్యక్రియల నిమిత్తం 10,000 రూపాయల నగదు సహాయం ను అందజేశారు.
అదేవిధంగా 1 లక్ష రూపాయల జీవిత బీమా ను కూడా అనిల్ కుటుంబానికి అందజేస్తామని సంఘం నాయకులు ప్రకటించారు.
కష్ట సమయంలో సహాయం అందించిన సంఘం నాయకులకు స్థానికులు కృతజ్ఞతలు తెలిపారు.





