ePaper
Tuesday, October 27, 2026
ads
📄 ePaper
Homeకమాన్‌పూర్ఆదివరాహస్వామిని దర్శించుకున్న జిల్లా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దొణికెన రవి

ఆదివరాహస్వామిని దర్శించుకున్న జిల్లా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దొణికెన రవి

📰 Generate e-Paper Clip

జనోదయ,కమాన్‌పూర్‌, అక్టోబర్‌ 21: 

కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని శ్రీ ఆదివరాహస్వామి ఆలయాన్ని పెద్దపల్లి జిల్లా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దొణికెన రవి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ డైరెక్టర్లు బూస శ్రీనివాస్‌ గౌడ్‌, చాట్ల రాయమల్లు, కొంతం శ్రీనివాస్‌, ఆలయ ప్రధాన అర్చకులు వరప్రసాదాచార్యులు ఆయనకు స్వాగతం పలికారు.

అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ డైరెక్టర్లు ఆలయ చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాధాన్యత, ప్రత్యేకతలను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు వివరించారు. ఆదివరాహస్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే పవిత్ర క్షేత్రమని పేర్కొన్నారు. ఆలయ విశిష్టతను తెలుసుకున్న దొణికెన రవి సంతోషం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డైరెక్టర్లు బూస శ్రీనివాస్‌ గౌడ్‌, చాట్ల రాయమల్లు, కొంతం శ్రీనివాస్‌, ప్రధాన అర్చకులు వరప్రసాదాచార్యులతో పాటు మాజీ ఆలయ ధర్మకర్త దండే కనకరత్నం పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular