జనోదయ,కమాన్‌పూర్, అక్టోబర్ 21:
పెద్దపల్లి జిల్లా పబ్లిక్ ప్రాసిక్యూటర్ దొణికెన రవిని కమాన్‌పూర్ సాగర సంఘం అధ్యక్షుడు రెవెల్లి శంకర్ బుధవారం శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరిన్ని ఉన్నత స్థాయులకు ఎదగాలని ఆకాంక్షించారు. సమాజంలో న్యాయవ్యవస్థకు సంబంధించిన సేవలు కీలకమని, బాధ్యతాయుతంగా విధులు నిర్వహించే వారిని గౌరవించడం అభినందనీయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సుభాష్‌నగర్ దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పోతుల కుమార్, ఆదివరాహస్వామి ఆలయ మాజీ ధర్మకర్త దండే కనకరత్నం పాల్గొన్నారు.





