ఆదివరాహస్వామిని దర్శించుకున్న జిల్లా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దొణికెన రవి

జనోదయ,కమాన్‌పూర్‌, అక్టోబర్‌ 21:  కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని శ్రీ ఆదివరాహస్వామి ఆలయాన్ని పెద్దపల్లి జిల్లా పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌ దొణికెన రవి బుధవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ డైరెక్టర్లు బూస శ్రీనివాస్‌ గౌడ్‌, చాట్ల రాయమల్లు, కొంతం శ్రీనివాస్‌, ఆలయ ప్రధాన అర్చకులు వరప్రసాదాచార్యులు ఆయనకు స్వాగతం పలికారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ డైరెక్టర్లు ఆలయ చారిత్రక నేపథ్యం, ఆధ్యాత్మిక ప్రాధాన్యత, ప్రత్యేకతలను పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌కు వివరించారు. ఆదివరాహస్వామి ఆలయం భక్తులకు ఆధ్యాత్మిక ప్రశాంతతను అందించే...