ePaper
Saturday, September 12, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణవరంగల్అనిల్ కుటుంబాన్ని పరామర్శించిన "ఏనుమాముల ఆటో యూనియన్"

అనిల్ కుటుంబాన్ని పరామర్శించిన “ఏనుమాముల ఆటో యూనియన్”

📰 Generate e-Paper Clip

-10 వేల ఆర్థిక సాయం అందజేత

జనోదయ: వరంగల్ ప్రతినిధి ఆగస్టు 04

14వ డివిజన్ బాలాజీ నగర్, ఏనుమాముల మార్కెట్ ఆటో అడ్డా సభ్యుడు సిలువేరు అనిల్ ప్రమాదవశాత్తు మృతిచెందిన విషయం తెలిసిందే. మృతుని పార్థివదేహానికి నివాళులు అర్పించిన ఏనుమాముల ఆటో యూనియన్ ప్రతినిధులు, అడ్డా అధ్యక్షుడు ఎండి సలీం ఆధ్వర్యంలో అనిల్ కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా అనిల్ భార్య గౌరిక, పిల్లలు విశ్వాంతిక, విన్నులకు సానుభూతి తెలిపి, వారి కుటుంబానికి అండగా 10 వేల రూపాయల ఆర్థిక సాయం ను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడ్డా ఉపాధ్యక్షుడు త్రీ కోవెల వేణు, కార్యదర్శి పాలకుర్తి ప్రసాద్ గౌడ్, కోశాధికారి ఎనమందల కృష్ణమూర్తి, ఉప కోశాధికారి ఆకుల శ్రీధర్ గౌడ్, నాయకులు హనుమకొండ కుమారస్వామి, శ్రీనివాస్ రెడ్డి, డోలే నగేష్, ఎండి జావిద్, అప్పని మధు, గంధం శ్రీనివాస్, ఎండి పాషా, గంధం రాజేష్, దేవసాని ప్రశాంత్, జంగం సురేష్, మెహతా రాజేందర్, కోటేశ్వర్, ఎండి గౌస్, ఎండి మహబూబ్ పాషా, త్రీ కోవెల రమేష్, సిలువేరు సుమన్, ఈసుబాయ్, దొంతురాల రవి పాల్గొన్నారు. ఆకస్మికంగా కుటుంబ పెద్దను కోల్పోయిన అనిల్ కుటుంబానికి అండగా నిలిచిన ఆటో యూనియన్ నాయకుల చర్యను స్థానికులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular