ePaper
Friday, October 2, 2026
ads
📄 ePaper
Homeకమాన్‌పూర్గుండారం ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన సెర్ప్‌ విజిలెన్స్‌ బృందం

గుండారం ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన సెర్ప్‌ విజిలెన్స్‌ బృందం

📰 Generate e-Paper Clip

జనోదయ,కమాన్‌పూర్‌, అక్టోబర్‌ 1:

కమాన్‌పూర్‌ మండలంలోని గుండారం ప్రభుత్వ పాఠశాలను సెర్ప్‌ విజిలెన్స్‌ బృందం గురువారం సందర్శించింది. బృందంలోని డైరెక్టర్‌ కృష్ణమూర్తి, జేపీఈ నాగేష్‌ పాఠశాలలో విద్యార్థులకు అందజేసిన యూనిఫామ్‌ల నాణ్యతను పరిశీలించారు.

 

యూనిఫామ్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం వాటి నాణ్యతపై ఎలాంటి ఫిర్యాదులు లేవని, యూనిఫామ్‌లు నాణ్యంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన దుస్తులు అందేలా యూనిఫామ్‌లను తయారు చేసిన ఆదివరాహ టైలరింగ్‌ సెంటర్‌ సభ్యులను అభినందించారు.

అనంతరం బృందం ఆదివరాహ టైలరింగ్‌ సెంటర్‌ను సందర్శించి తయారీ ప్రక్రియను పరిశీలించింది. యూనిఫామ్‌ల కుట్టు పనిలో నాణ్యతా ప్రమాణాలను కొనసాగించాలని, పనిలో మరింత జాగ్రత్తలు తీసుకోవాలని సభ్యులకు పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో డీపీఎం సంజయ్‌కుమార్‌, ఏపీఎం పద్మ, సీసీ బిక్షపతి, ఆదివరాహ టైలరింగ్‌ సెంటర్‌ సభ్యులు పిట్టల పద్మ, సరోజన, మల్లేశ్వరి, ఇతర సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular