ePaper
Friday, October 2, 2026
ads
📄 ePaper
Homeకమాన్‌పూర్మహిళా అక్షరాస్యతకు ‘ఉల్లాస్‌’ బాట

మహిళా అక్షరాస్యతకు ‘ఉల్లాస్‌’ బాట

📰 Generate e-Paper Clip

జనోదయ,కమాన్‌పూర్‌, సెప్టెంబర్‌ 27: 

తెలంగాణ ప్రభుత్వ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్‌) ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళల్లో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు అమలు చేస్తున్న ‘ఉల్లాస్‌’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్‌ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు.

కమాన్‌పూర్‌ గ్రామపంచాయతీ పరిధిలోని ఎనిమిది వీఓ సంఘాలకు చెందిన మహిళలు పరీక్షలకు హాజరై ఉత్సాహంగా పరీక్షలు రాశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్‌ రంగు సత్యనారాయణగౌడ్‌ హాజరై పరీక్షలు రాస్తున్న మహిళలను అభినందించారు. వయస్సుతో సంబంధం లేకుండా విద్యను అభ్యసించాలనే సంకల్పంతో మహిళలు ముందుకు రావడం అభినందనీయమని పేర్కొన్నారు.

కమాన్‌పూర్‌ మండల ఏపీఎం పద్మ మాట్లాడుతూ ‘ఉల్లాస్‌’ కార్యక్రమం ద్వారా మహిళల్లో అక్షరాస్యత పెంపొందించడంతో పాటు జీవితాంతం నేర్చుకునే అవకాశాలను కల్పించడమే లక్ష్యమన్నారు. విద్యతో మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరిగి కుటుంబ, సామాజిక అభివృద్ధిలో మరింత చురుకైన పాత్ర పోషించే అవకాశం ఉంటుందని తెలిపారు.

కార్యక్రమంలో గ్రామ ఉపసర్పంచ్‌ మహమ్మద్‌ రఫిక్‌ సోహెల్‌, వార్డు సభ్యులు పచ్చునూరి రాజ్‌కుమార్‌, పంజా సాయిరాం, మేడగోని సత్తమ్మ, సీసీ బిక్షపతి, సీఏలు మేఘమాల, స్వప్న, సంధ్య, సరిత, శైలజ, భాగ్య, శ్రీహర్షిత తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular