మహిళా అక్షరాస్యతకు ‘ఉల్లాస్’ బాట
జనోదయ,కమాన్‌పూర్, సెప్టెంబర్ 27: తెలంగాణ ప్రభుత్వ గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళల్లో నిరక్షరాస్యతను నిర్మూలించేందుకు అమలు చేస్తున్న ‘ఉల్లాస్’ కార్యక్రమంలో భాగంగా ఆదివారం కమాన్‌పూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి పరీక్షలు నిర్వహించారు. కమాన్‌పూర్ గ్రామపంచాయతీ పరిధిలోని ఎనిమిది వీఓ సంఘాలకు చెందిన మహిళలు పరీక్షలకు హాజరై ఉత్సాహంగా పరీక్షలు రాశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణగౌడ్ హాజరై పరీక్షలు రాస్తున్న మహిళలను అభినందించారు. వయస్సుతో...