ePaper
Friday, October 2, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణపెద్దపల్లిమంథని నియోజకవర్గ వార్డ్‌ మెంబర్స్‌ ఫోరం ఇన్‌చార్జిగా సొప్పరి సంతోష్‌కుమార్‌

మంథని నియోజకవర్గ వార్డ్‌ మెంబర్స్‌ ఫోరం ఇన్‌చార్జిగా సొప్పరి సంతోష్‌కుమార్‌

📰 Generate e-Paper Clip

జనోదయ,పెద్దపల్లి‌, సెప్టెంబర్‌ 23:

తెలంగాణ వార్డ్‌ మెంబర్స్‌ ఫోరం మంథని నియోజకవర్గ ఇన్‌చార్జిగా సొప్పరి సంతోష్‌కుమార్‌ను నియమించారు. తెలంగాణ వార్డ్‌ మెంబర్స్‌ ఫోరం రాష్ట్ర ఫౌండర్‌ నాగవెల్లి జ్యోతి మహేష్‌ ఆదేశాల మేరకు పెద్దపల్లి జిల్లా ఫోరం ఆధ్వర్యంలో ఈ నియామకం చేపట్టారు.

పెద్దపల్లి జిల్లా ఫోరం ఇన్‌చార్జి తప్పట్ల మోహన్‌ ఆధ్వర్యంలో పెద్దపల్లి ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన కార్యక్రమంలో సొప్పరి సంతోష్‌కుమార్‌కు మంథని నియోజకవర్గ బాధ్యతలను అప్పగించారు. ఈ సందర్భంగా తప్పట్ల మోహన్‌ మాట్లాడుతూ నియోజకవర్గ పరిధిలోని వార్డు సభ్యులను సమన్వయం చేసుకుంటూ ఫోరాన్ని బలోపేతం చేయాలని సూచించారు. వార్డు సభ్యులు ఎదుర్కొంటున్న సమస్యలను రాష్ట్ర స్థాయి నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వారి హక్కుల సాధనకు ఫోరం తరఫున నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.

నూతనంగా నియమితులైన సొప్పరి సంతోష్‌కుమార్‌ మాట్లాడుతూ తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర ఫౌండర్‌ నాగవెల్లి జ్యోతి మహేష్‌, జిల్లా ఇన్‌చార్జి తప్పట్ల మోహన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. నియోజకవర్గంలోని వార్డు సభ్యులతో సమన్వయం చేసుకుంటూ వారి సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం తనవంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా మీడియా ఇన్‌చార్జి సిహెచ్‌. ఉదయ్‌కుమార్‌ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular