గుండారం ప్రభుత్వ పాఠశాలను సందర్శించిన సెర్ప్ విజిలెన్స్ బృందం
జనోదయ,కమాన్‌పూర్, అక్టోబర్ 1: కమాన్‌పూర్ మండలంలోని గుండారం ప్రభుత్వ పాఠశాలను సెర్ప్ విజిలెన్స్ బృందం గురువారం సందర్శించింది. బృందంలోని డైరెక్టర్ కృష్ణమూర్తి, జేపీఈ నాగేష్ పాఠశాలలో విద్యార్థులకు అందజేసిన యూనిఫామ్‌ల నాణ్యతను పరిశీలించారు. యూనిఫామ్‌లను క్షుణ్ణంగా పరిశీలించిన అనంతరం వాటి నాణ్యతపై ఎలాంటి ఫిర్యాదులు లేవని, యూనిఫామ్‌లు నాణ్యంగా ఉన్నాయని వారు పేర్కొన్నారు. విద్యార్థులకు నాణ్యమైన దుస్తులు అందేలా యూనిఫామ్‌లను తయారు చేసిన ఆదివరాహ టైలరింగ్ సెంటర్ సభ్యులను అభినందించారు. అనంతరం బృందం ఆదివరాహ టైలరింగ్ సెంటర్‌ను సందర్శించి తయారీ ప్రక్రియను పరిశీలించింది....