జనోదయ,కమాన్‌పూర్, సెప్టెంబర్ 18:
కమాన్‌పూర్ మండలం పెంచికల్‌పేట్ గ్రామంలో వార్డు సభ్యులు, సర్పంచ్, పంచాయతీ కార్యదర్శి మధ్య సమన్వయ లోపంతో నెలకొన్న సమస్యలను వార్డు సభ్యులు తెలంగాణ రాష్ట్ర వార్డు మెంబర్ల ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు జ్యోతి మహేష్ దృష్టికి తీసుకెళ్లారు. దీంతో పెద్దపల్లి జిల్లా వార్డు మెంబర్ల ఫోరం ఇన్‌చార్జి మోహన్ ఆధ్వర్యంలో, కమాన్‌పూర్ మండల ఇన్‌చార్జి సొప్పరి సంతోష్‌కుమార్ సమక్షంలో సమస్యలపై చర్చించి పరిష్కార మార్గాలను సూచించారు.
ఈ సందర్భంగా గ్రామపంచాయతీ పాలకవర్గంలో సమన్వయంతో పనిచేస్తే ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చని సూచించారు. కార్యక్రమంలో సభ్యులు పరమేశ్వర్, అనిల్, ఉదయ్‌తో పాటు వివిధ గ్రామాల వార్డు సభ్యులు, ప్రతినిధులు పాల్గొన్నారు.





