ePaper
Saturday, September 12, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణవరంగల్పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించిన* "ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు"

పారిశుధ్య కార్మికులను ఘనంగా సన్మానించిన* “ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు”

📰 Generate e-Paper Clip

 

-తాత్కాలిక సిబ్బందికి మొదటి నెల జీతాల చెక్కులు అందజేత

జనోదయ వరంగల్ ప్రతినిధి: ఆగస్టు 05

వర్ధన్నపేట మున్సిపాలిటీలో పారిశుధ్య సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని, వరంగల్ జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కొత్తగా 8 మంది పారిశుధ్య సిబ్బందిని తాత్కాలిక ప్రాతిపదికన నియమించారు. చేరిన కొత్త సిబ్బందికి సంబంధించిన మొదటి నెల జీతాల చెక్కును వర్ధన్నపేట మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి ఆధ్వర్యంలో వర్ధన్నపేట ఎమ్మెల్యే, విశ్రాంత ఐపీఎస్ అధికారి కేఆర్ నాగరాజు అందజేసి, వారిని శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. “పట్టణ పరిశుభ్రతతో పాటు ప్రజారోగ్య పరిరక్షణలో మున్సిపల్ కార్మికుల పాత్ర కీలకమైనది. ఎండ వానలకు సైతం లెక్కచేయకుండా ప్రజలకు పరిశుభ్రమైన వాతావరణాన్ని అందించేందుకు వారు నిరంతరం శ్రమిస్తున్నారు” అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు బెజ్జం పాపారావు, మలోతు దేవేందర్, తిరుపేల్లి వాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ నరకుడు వెంకటయ్య, పట్టణ అధ్యక్షులు ఈగ దామోదర్, మండల పార్టీ అధ్యక్షులు పోశాల వెంకన్న, మాజీ మండల అధ్యక్షులు ఎద్దు సత్యనారాయణ, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు అబ్బిడి రాజిరెడ్డి, మండల యూత్ అధ్యక్షులు భాను ప్రసాద్, సీనియర్ నాయకులు కీమా నాయక్, బక్కతట్ల రాజ్ యాదవ్, నేతవత్ రాజేందర్ తో పాటు అధికారులు, సిబ్బంది, పారిశుధ్య కార్మికులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular