ePaper
Friday, September 11, 2026
ads
📄 ePaper
Homeకరీంనగర్గంగాధరదళిత సర్పంచ్‌పై బీఆర్‌ఎస్ నాయకుల దాడి హేయమైన చర్య

దళిత సర్పంచ్‌పై బీఆర్‌ఎస్ నాయకుల దాడి హేయమైన చర్య

📰 Generate e-Paper Clip

 

– గంగాధర మండల కాంగ్రెస్ తీవ్ర ఆగ్రహం

గంగాధర మండలం నారాయణపూర్ సర్పంచ్ భర్త ధీకొండ మధుపై జరిగిన దాడిని గంగాధర మండల కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ మేరకు మండల ప్రజా కార్యాలయంలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో కాంగ్రెస్ నాయకులు మాట్లాడుతూ.. కేవలం ఒక గ్రామ సభలో తీర్మానం చేసినంత మాత్రాన ముంపు గ్రామం సమస్య పరిష్కారం కాదని, ఒకవేళ అలా అవకాశం ఉంటే గతంలో ఇక్కడే పుట్టి పెరిగిన రవిశంకర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అప్పటి సర్పంచ్‌పై ఎందుకు ఒత్తిడి చేయలేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీలో ఒక దళిత సర్పంచ్ గెలిచిన రోజు నుండి బీఆర్‌ఎస్ నాయకులు ఓర్వలేక అక్కడి ప్రజలను రెచ్చగొడుతూ అనేక ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. దళితులు సర్పంచులు అయితే మీ కళ్లు మండుతున్నాయా, దళితులు ప్రజాప్రతినిధులు కావద్దా అని వారు తీవ్రంగా విమర్శించారు. గతంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడే నారాయణపూర్ రిజర్వాయర్ పనులు 90 శాతం జరిగాయని, గత బీఆర్‌ఎస్ 10 సంవత్సరాల పాలనలో ఏం చేయకపోతే తామే అనేక పోరాటాలు చేశామని గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ కాంగ్రెస్ గెలిచాక మిగతా పనులను పూర్తి చేయడానికి సిద్ధమై, గౌరవ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు స్వయంగా నారాయణపూర్ తీసుకువచ్చి నిధులు మంజూరు చేయించి పనులు చేస్తుంటే.. బీఆర్‌ఎస్ నాయకులు కాళ్లల్లో కట్టెలు పెట్టినట్లు అడ్డుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారు అనేక సార్లు అసెంబ్లీలో లో నారాయణపూర్ ప్రస్తావన తీసుకొచ్చారని,మంత్రులతో నిత్యం మాట్లాడుతూ వారికి న్యాయం చేయడానికి అనేక ప్రయత్నాలు చేస్తుంటే ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం గారికి, ఇక్కడి సర్పంచ్‌కు ఎక్కడ మంచి పేరు వస్తుందో, తాము ఎక్కడ కనుమరుగైపోతామోననే రాజకీయ అసూయతోనే బీఆర్‌ఎస్ నాయకులు ఈ దాడులకు తెగబడుతున్నారని, ఈ అరాచకాలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు.తీవ్ర మనస్తాపానికి గురైన సర్పంచ్ భర్త ఆత్మహత్యయత్నం చెసుకున్నారని తనకు ఏమన్నా జరిగితే బిఅరెస్ నాయకులు భాద్యత వహిస్తారా అని ఇక ముందు ఇలాంటి దాడులు జరిగితే కాంగ్రెస్ పార్టీ పక్షాన చూస్తూ ఊరుకునేది లేదని నాయకులు హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మంత్రి మహేందర్,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దుబ్బాసి బుచ్చయ్య,జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి రొమాల రమేష్,మాజీ జెడ్పిటిసి గునుకొండ బాబు, సర్పంచ్ లు పడాల భాగ్యలక్ష్మి రాజన్న, వేముల భాస్కర్, దాసరి శంకరయ్య,రాచమల్ల రవి,బాసవేని శ్రీనివాస్,కోలేపాక కవిత మల్లేష్,బీర్ల ఆనంద్,గుండవేని లావణ్య తిరుపతి,చిందం ఆంజనేయులు,కాంగ్రెస్ పార్టీ నాయకులు అత్తపురం తిరుపతి,దాతు అంజి,పెంచాల చందు,కడారి కుమారస్వామి,కముటం శ్రీనివాస్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular