ePaper
Tuesday, July 28, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణపెద్దపల్లిడిసిపి రామ్ రెడ్డికి ఘన సన్మానం

డిసిపి రామ్ రెడ్డికి ఘన సన్మానం

📰 Generate e-Paper Clip

🔹శాంతిభద్రతల పరిరక్షణలో సేవలు అభినందనీయం:బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంథని రఘు

జనోదయ,ఎన్టీపీసీ మే 9:

ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో డిసిపి రాంరెడ్డిని పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం శాలువాతో సత్కరించి పోలీస్ శాఖ సేవలను కొనియాడారు.

ఈ సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంథని రఘు మాట్లాడుతూ,రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణలో డిసిపి రాంరెడ్డి సమర్థవంతమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు.ప్రజలకు భద్రత కల్పించడంలో స్నేహపూర్వక పోలీసింగ్‌ను అమలు చేస్తూ ప్రజల్లో పోలీస్ శాఖపై విశ్వాసాన్ని పెంపొందిస్తున్నారని పేర్కొన్నారు.

సమస్యాత్మక ప్రాంతాల్లో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా ముందస్తు చర్యలు తీసుకోవడంలో చూపుతున్న చొరవ ప్రశంసనీయమని తెలిపారు.ప్రజా సమస్యల పట్ల సానుకూల దృక్పథంతో స్పందించడం వల్ల పోలీస్ వ్యవస్థపై ప్రజల్లో నమ్మకం మరింత బలపడుతోందని అభిప్రాయపడ్డారు.

ఈ కార్యక్రమంలో గుల్గం రవీందర్ గౌడ్,వెంకట్ రెడ్డి,కట్కూరి సందీప్‌తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు.పోలీస్ శాఖ ప్రజలకు మరింత చేరువ కావాలని ఆకాంక్షిస్తూ నాయకులు తమ అభినందనలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular