డిసిపి రామ్ రెడ్డికి ఘన సన్మానం
🔹శాంతిభద్రతల పరిరక్షణలో సేవలు అభినందనీయం:బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంథని రఘు జనోదయ,ఎన్టీపీసీ మే 9: ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్‌లో శనివారం నిర్వహించిన కార్యక్రమంలో డిసిపి రాంరెడ్డిని పలువురు ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించారు.పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేసిన అనంతరం శాలువాతో సత్కరించి పోలీస్ శాఖ సేవలను కొనియాడారు. ఈ సందర్భంగా బీసీ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మంథని రఘు మాట్లాడుతూ,రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో శాంతిభద్రతల పరిరక్షణలో డిసిపి రాంరెడ్డి సమర్థవంతమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు.ప్రజలకు భద్రత కల్పించడంలో స్నేహపూర్వక పోలీసింగ్‌ను అమలు...