ePaper
Wednesday, May 20, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణపెద్దపల్లిమోడీ సభ విజయవంతానికి బీజేపీ శ్రేణుల విస్తృత ప్రచారం

మోడీ సభ విజయవంతానికి బీజేపీ శ్రేణుల విస్తృత ప్రచారం

📰 Generate e-Paper Clip

🔹8 ఇంక్లైన్ కాలనీలో గోడ రాతలు,ప్రచార కార్యక్రమాలతో సందడి

జనోదయ, 8వ కాలనీ మే 10:

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ 8 ఇంక్లైన్ కాలనీ బీజేపీ శ్రేణులు విస్తృత ప్రచారం చేపట్టాయి.భారతీయ జనతా పార్టీ 8వ కాలనీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమం కాలనీలో రాజకీయ ఉత్సాహాన్ని నింపింది.

వాణిజ్య సముదాయాలు,ప్రధాన వీధుల్లో ప్రచారం నిర్వహించిన నాయకులు ప్రజలను సభకు భారీగా తరలిరావాలని కోరారు.గోడ రాతలు రాస్తూ మోడీ సభకు మద్దతు ప్రకటించారు.దేశ ప్రధానిగా మూడోసారి బాధ్యతలు చేపట్టిన అనంతరం తెలంగాణలో ప్రధాని మొదటిసారిగా అడుగుపెడుతున్న నేపథ్యంలో ఈ సభకు ప్రత్యేక ప్రాధాన్యత ఏర్పడిందని బీజేపీ నాయకులు పేర్కొన్నారు.

8 ఇంక్లైన్ కాలనీ పరిధిలోని అన్ని డివిజన్ల కార్యకర్తలు,బూత్ అధ్యక్షులు,సీనియర్ నాయకులు సభకు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకులు మూకిరి రాజు,మండల అధ్యక్షుడు ఆకుల శశికుమార్,ఆకుల కుమార్ గౌడ్,బద్రి దేవేందర్ పటేల్,గంధం శంకర్,జంజర్ల శ్రీనివాస్,వేణుగోపాల్ రావు,నీలం రవి,అఖిల్ గౌడ్,గణేష్,లక్ష్మణ్ కుమార్,కాశిపేట రాజశేఖర్,చొప్పరి స్వామి,మండ సాయి ప్రణీత్,రామంచ శ్రావణ్,విక్కీ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular