మోడీ సభ విజయవంతానికి బీజేపీ శ్రేణుల విస్తృత ప్రచారం

🔹8 ఇంక్లైన్ కాలనీలో గోడ రాతలు,ప్రచార కార్యక్రమాలతో సందడి జనోదయ, 8వ కాలనీ మే 10: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో శనివారం సాయంత్రం నిర్వహించనున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ 8 ఇంక్లైన్ కాలనీ బీజేపీ శ్రేణులు విస్తృత ప్రచారం చేపట్టాయి.భారతీయ జనతా పార్టీ 8వ కాలనీ మండల శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ప్రచార కార్యక్రమం కాలనీలో రాజకీయ ఉత్సాహాన్ని నింపింది. వాణిజ్య సముదాయాలు,ప్రధాన వీధుల్లో ప్రచారం నిర్వహించిన నాయకులు ప్రజలను సభకు భారీగా తరలిరావాలని కోరారు.గోడ రాతలు...