ePaper
Tuesday, July 28, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి

ఉద్యమకారుల సంక్షేమ బోర్డును ఏర్పాటు చేయాలి

📰 Generate e-Paper Clip

 

ఉద్యమంలో డిబిఎఫ్ పాత్ర ఎనలేనిది

అసలైన ఉద్యమకారులను
గుర్తించి పథకాలు వర్తింపజేయాలి

డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చుంచు రాజేందర్ డిమాండ్

కేకే కమిటీకి పలు డిమాండ్ లతో కూడిన వినతిపత్రం సమర్పణ

జనోదయ,హనుమకొండ, జులై 17:

ఉద్యమకారుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి పదివేల కోట్ల నిధులు మంజూరు చేసి మలిదశ తెలంగాణ ఉద్యమకారులను ఆదుకోవాలని,
ఉద్యమంలో డిబిఎఫ్ పాత్ర ఎనలేనిదని దళిత బహుజన ఫ్రంట్ (డిబిఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు హైదరాబాదులోని అమరదామంలో వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన తెలంగాణ ఉద్యమకారులతో తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు కమిటీ సమావేశం కే కేశవరావు అధ్యక్షతన నిర్వహించగా కమిటి సభ్యులు ప్రొఫెసర్,ఎమ్మెల్సీ కొదండరామ్,
మాజీ ఎమ్మెల్సీ రామలు నాయక్ లకు డిబిఎఫ్ ఆద్వర్యంలో పలు డిమాండ్ లతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా డిబిఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్ మాట్లాడుతూ కేసులతో సంబంధం లేకుండా అసలైన ఉద్యమకారులను గుర్తించాలని, ప్రజాసంఘాల నాయకులకువిద్యా,వైద్యం,ఉద్యోగ, ఉపాధి రంగాలలో ఆవకాశం కల్పించాలని, ఇందిరమ్మ ఇండ్లు, సంక్షేమ పథకాలలో మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.
ఈ కార్యక్రమంలో డిబిఎఫ్ జిల్లా ఉపాధ్యక్షులు చుంచు నరేష్,మాల మహనాడు జిల్లా అధ్యక్షులు అంకేశ్వరపు రాంచందర్ రావ్, ప్రజా సంఘాల జెఎసి జిల్లా చైర్మన్ మాదాసి సురేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular