ePaper
Tuesday, July 28, 2026
ads
📄 ePaper
Homeకమాన్‌పూర్పీరీల పండుగ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్

పీరీల పండుగ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్

📰 Generate e-Paper Clip

జనోదయా,కమాన్‌పూర్ జూన్ 26:

మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించే పీరీల పండుగ వేడుకల్లో కమాన్‌పూర్ గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పీరీలను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో శాంతి, సుభిక్షం, సోదరభావం నెలకొని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం భక్తులను కలుసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవం, ఐక్యతతో పండుగలను జరుపుకోవడం సమాజానికి ఆదర్శమని ఆయన పేర్కొన్నారు. పీరీల పండుగలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని భక్తిశ్రద్ధలతో ప్రార్థనలు నిర్వహించడంతో మండల కేంద్రంలో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular