పీరీల పండుగ వేడుకల్లో పాల్గొన్న సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్
జనోదయా,కమాన్పూర్ జూన్ 26: మత సామరస్యానికి ప్రతీకగా నిర్వహించే పీరీల పండుగ వేడుకల్లో కమాన్పూర్ గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్ కుటుంబ సభ్యులతో కలిసి పాల్గొన్నారు. మండల కేంద్రంలోని మార్కెట్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన పీరీలను దర్శించి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో శాంతి, సుభిక్షం, సోదరభావం నెలకొని ప్రతి కుటుంబం సుఖసంతోషాలతో ఉండాలని ప్రార్థించారు. అనంతరం భక్తులను కలుసుకుని పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవం, ఐక్యతతో పండుగలను జరుపుకోవడం సమాజానికి ఆదర్శమని ఆయన...