ePaper
Tuesday, July 28, 2026
ads
📄 ePaper
Homeతెలంగాణపెద్దపల్లిసుల్తానాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభంజనం – 15లో 12 స్థానాలు కైవసం

సుల్తానాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభంజనం – 15లో 12 స్థానాలు కైవసం

📰 Generate e-Paper Clip

జనోదయ,సుల్తానాబాద్ ఫిబ్రవరి 13:

పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది.మొత్తం 15 వార్డులున్న మున్సిపాలిటీలో 12 స్థానాలను గెలుచుకుని పట్టణ పాలనపై స్పష్టమైన ఆధిపత్యాన్ని చాటుకుంది.ఈ ఫలితాలు సుల్తానాబాద్ పట్టణ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి.

ఎన్నికల ఫలితాల ప్రకారం ఈర్ల స్వరూప,గాజుల రాజమల్లు,బిరుదు కృష్ణ,గరిగే శోభారాణి,బాకం సాయి కిరణ్,వర ప్రదీప్,చింతల రాజు,టికే ప్రభాకర్,అంతటి పుష్పలత,సిద్ధ తిరుపతి,వేగోళం పద్మ,గాదాసు మంజుల కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు.బీజేపీ నుంచి కందునూరి సమత ఒక్క స్థానం గెలుచుకోగా,బిఆర్ఎస్ తరఫున కల్వల శంకరమ్మ విజయం సాధించారు.సింహం గుర్తుపై అమీరిశెట్టి శ్రావణి గెలుపొందారు.

మొత్తం ఫలితాల్లో కాంగ్రెస్ 12 స్థానాలు,బీజేపీ 1,బిఆర్ఎస్ 1,సింహం గుర్తు 1 స్థానంతో నిలిచాయి.ఈ ఫలితాలతో సుల్తానాబాద్ మున్సిపాలిటీపై కాంగ్రెస్ పూర్తి పట్టు సాధించింది.పట్టణాభివృద్ధి,సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు కాంగ్రెస్ పట్ల విశ్వాసం వ్యక్తం చేశారని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

ఈ విజయంతో పెద్దపల్లి జిల్లాలో కాంగ్రెస్ శ్రేణుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది.సుల్తానాబాద్ పట్టణ రాజకీయాల్లో ఈ ఫలితం కీలక మలుపుగా నిలిచిందని,రాబోయే రాజకీయ పరిణామాలకు ఇది దిశానిర్దేశం చేయనుందని భావిస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular