సుల్తానాబాద్ మున్సిపాలిటీలో కాంగ్రెస్ ప్రభంజనం – 15లో 12 స్థానాలు కైవసం
జనోదయ,సుల్తానాబాద్ ఫిబ్రవరి 13: పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయాన్ని నమోదు చేసింది.మొత్తం 15 వార్డులున్న మున్సిపాలిటీలో 12 స్థానాలను గెలుచుకుని పట్టణ పాలనపై స్పష్టమైన ఆధిపత్యాన్ని చాటుకుంది.ఈ ఫలితాలు సుల్తానాబాద్ పట్టణ రాజకీయ సమీకరణాలను పూర్తిగా మార్చేశాయి. ఎన్నికల ఫలితాల ప్రకారం ఈర్ల స్వరూప,గాజుల రాజమల్లు,బిరుదు కృష్ణ,గరిగే శోభారాణి,బాకం సాయి కిరణ్,వర ప్రదీప్,చింతల రాజు,టికే ప్రభాకర్,అంతటి పుష్పలత,సిద్ధ తిరుపతి,వేగోళం పద్మ,గాదాసు మంజుల కాంగ్రెస్ తరఫున విజయం సాధించారు.బీజేపీ నుంచి కందునూరి సమత ఒక్క స్థానం గెలుచుకోగా,బిఆర్ఎస్ తరఫున...