ePaper
Tuesday, October 27, 2026
ads
📄 ePaper
Homeకమాన్‌పూర్శ్రీనగర్‌లో అట్టహాసంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

శ్రీనగర్‌లో అట్టహాసంగా సద్దుల బతుకమ్మ సంబరాలు

📰 Generate e-Paper Clip

జనోదయ,కమాన్‌పూర్‌, అక్టోబర్‌ 19: 

కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని శ్రీనగర్‌లో సద్దుల బతుకమ్మ వేడుకలను మహిళలు ఘనంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకుని మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా సంబరాలు జరుపుకున్నారు. యువతులు దాండియా నృత్యాలతో సందడి చేశారు. పాటలు, ఆటపాటలతో శ్రీనగర్‌ ప్రాంతమంతా పండుగ శోభను సంతరించుకుంది. మహిళలు, యువతులు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని తెలంగాణ సంస్కృతీ వైభవాన్ని చాటిచెప్పారు. సద్దుల బతుకమ్మ వేడుకలు స్థానికంగా ఆనందోత్సాహాలను నింపాయి.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular