ePaper
Tuesday, October 27, 2026
ads
📄 ePaper
Homeకమాన్‌పూర్సుభాష్‌నగర్‌ దుర్గామాతను దర్శించుకున్న మంత్రి శ్రీధర్‌బాబు

సుభాష్‌నగర్‌ దుర్గామాతను దర్శించుకున్న మంత్రి శ్రీధర్‌బాబు

📰 Generate e-Paper Clip

జనోదయ,కమాన్‌పూర్‌, అక్టోబర్‌ 19:

కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో నిర్వహిస్తున్న దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దుర్గామాతను దర్శించుకున్నారు. దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పోతుల కుమార్‌ ఆహ్వానం మేరకు విచ్చేసిన మంత్రికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి పాల్గొని, బతుకమ్మ ఆడుతున్న మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు ఆనందోత్సాహాలతో జరుపుకోవడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పోతుల కుమార్‌ మాట్లాడుతూ, తమ ఆహ్వానాన్ని మన్నించి సుభాష్‌నగర్‌కు విచ్చేసి దుర్గామాతను దర్శించుకోవడంతోపాటు, బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మంత్రి రాకతో ఉత్సవాల్లో మరింత ఉత్సాహం నెలకొందని పేర్కొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular