సుభాష్‌నగర్‌ దుర్గామాతను దర్శించుకున్న మంత్రి శ్రీధర్‌బాబు

జనోదయ,కమాన్‌పూర్‌, అక్టోబర్‌ 19: కమాన్‌పూర్‌ మండల కేంద్రంలోని సుభాష్‌నగర్‌లో నిర్వహిస్తున్న దుర్గామాత ఉత్సవాల్లో భాగంగా ఆదివారం తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు దుర్గామాతను దర్శించుకున్నారు. దుర్గామాత ఉత్సవ కమిటీ అధ్యక్షుడు పోతుల కుమార్‌ ఆహ్వానం మేరకు విచ్చేసిన మంత్రికి కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం స్థానిక ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన సద్దుల బతుకమ్మ వేడుకల్లో మంత్రి పాల్గొని, బతుకమ్మ ఆడుతున్న మహిళలకు పండుగ శుభాకాంక్షలు తెలియజేశారు. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను మహిళలు...