ePaper
Saturday, September 12, 2026
ads
📄 ePaper
Homeకరీంనగర్గంగాధరమధురానగర్‌లో పిల్లలని ఎత్తుకెళ్లే యత్నం.. అప్రమత్తమైన స్థానికులతో దుండగులు పరార్

మధురానగర్‌లో పిల్లలని ఎత్తుకెళ్లే యత్నం.. అప్రమత్తమైన స్థానికులతో దుండగులు పరార్

📰 Generate e-Paper Clip

గంగాధర, జూన్ 17 (జనోదయ):


గంగాధర మండలంలోని మధురానగర్ వార్డు నెం.5 లో బుధవారం సాయంత్రం 7.25కి  ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆడుకుంటున్న చిన్నారులని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన ఘటన స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేసింది.

స్థానికుల వివరాల ప్రకారం, హెచ్‌ఎఫ్ డీలక్స్ మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఎరుపు రంగు మాస్క్‌లు ధరించి, అక్కడ ఆడుకుంటున్న చిన్నారులను  బెదిరిస్తూ “రా” అంటూ తమ వెంట రావాలని పిలిచారు. ఈ విషయాన్ని గమనించిన సమీపంలోని పెద్దలు వెంటనే గట్టిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు.

పారిపోతూ గంగాధర బ్లాక్ రోడ్డు వైపు వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ఘటన నేపథ్యంలో గంగాధర మండల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జనోదయ పత్రిక  విజ్ఞప్తి చేస్తుంది.  

అనుమానాస్పదంగా తిరిగే వ్యక్తులు లేదా వాహనాలు కనిపిస్తే వెంటనే పోలీసుల(100)కు  సమాచారం అందించాలని కోరారు.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular