మధురానగర్‌లో పిల్లలని ఎత్తుకెళ్లే యత్నం.. అప్రమత్తమైన స్థానికులతో దుండగులు పరార్
గంగాధర, జూన్ 17 (జనోదయ): గంగాధర మండలంలోని మధురానగర్ వార్డు నెం.5 లో బుధవారం సాయంత్రం 7.25కి ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు ఆడుకుంటున్న చిన్నారులని ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నించిన ఘటన స్థానికుల్లో తీవ్ర ఆందోళనకు గురిచేసింది. స్థానికుల వివరాల ప్రకారం, హెచ్‌ఎఫ్ డీలక్స్ మోటార్‌సైకిల్‌పై వచ్చిన ఇద్దరు దుండగులు ఎరుపు రంగు మాస్క్‌లు ధరించి, అక్కడ ఆడుకుంటున్న చిన్నారులను బెదిరిస్తూ "రా" అంటూ తమ వెంట రావాలని పిలిచారు. ఈ విషయాన్ని గమనించిన సమీపంలోని పెద్దలు వెంటనే గట్టిగా కేకలు వేయడంతో దుండగులు అక్కడి నుంచి...