ePaper
Friday, April 3, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్మాజీ ఎమ్మెల్యే రవి శంకర్ పెళ్లి రోజు వేడుకలు

మాజీ ఎమ్మెల్యే రవి శంకర్ పెళ్లి రోజు వేడుకలు

📰 Generate e-Paper Clip

మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ – దీవెన  దంపతుల పెళ్లి రోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలు, సర్పంచ్ లు పండుగలా జరుపుకున్నారు.  దంపతులకు  శాలువా కప్పి బోకెలతో సత్కరించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య వేడుకలను నిర్వహించారు.

ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ తనకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో ఎల్లప్పుడూ సేవ చేయడానికి సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో   ముప్పిడి పల్లె సుధాకర్ (సర్పంచ్), మల్లేశం (మాజీ ఏఎంసీ చైర్మన్), రెగులపల్లి తిరుపతి (మాజీ ఉప సర్పంచ్), కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular