మాజీ ఎమ్మెల్యే రవి శంకర్ పెళ్లి రోజు వేడుకలు
మాజీ ఎమ్మెల్యే సుంకే రవి శంకర్ - దీవెన దంపతుల పెళ్లి రోజు సందర్భంగా పార్టీ కార్యకర్తలు, సర్పంచ్ లు పండుగలా జరుపుకున్నారు. దంపతులకు శాలువా కప్పి బోకెలతో సత్కరించి, కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆనందోత్సాహాల మధ్య వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా రవిశంకర్ మాట్లాడుతూ తనకు పెళ్లి రోజు శుభాకాంక్షలు తెలిపిన బీఆర్ఎస్ కార్యకర్తలకు, అభిమానులకు, శ్రేయోభిలాషులకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. ప్రజల ఆశీస్సులతో ఎల్లప్పుడూ సేవ చేయడానికి సిద్ధంగా ఉంటానని పేర్కొన్నారు....