ePaper
Monday, September 14, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్మెపా వరంగల్ జిల్లా అధ్యక్షులు తాళ్ళ రవీందర్ ముదిరాజ్ కు మాతృ వియోగం..

మెపా వరంగల్ జిల్లా అధ్యక్షులు తాళ్ళ రవీందర్ ముదిరాజ్ కు మాతృ వియోగం..

📰 Generate e-Paper Clip

 

తాళ్ల సుగుణ కు మెపా నివాళి

తాళ్ళ రవీందర్ ముదిరాజ్ ఆపదలో ఆదుకునే వాడు

మెపా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడలు పులి దేవేందర్..

జనోదయ, హనుమకొండ, ఫిబ్రవరి 24:

ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ ( మెపా) వరంగల్ జిల్లా అధ్యక్షులు తాళ్ల రవీందర్ ముదిరాజ్ మాతృమూర్తి తాళ్ల సుగుణ రోడ్డు ప్రమాదంలో వారి స్వగ్రామం వరంగల్ జిల్లా దుగ్గొండి మండలం చంద్రయ్య పల్లి లో మృతి చెందారు. ఈ సందర్భంగా ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్ అసోసియేషన్( మెపా) రాష్ట్ర వ్యవస్థాపక అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్ ఆధ్వర్యంలో రాష్ట్ర కమిటీ, వివిధ జిల్లాల కమిటీల బాధ్యులు సుగుణకు నివాళులర్పించారు ఈ సందర్భంగా పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ .. రవీందర్ తల్లి సుగుణ మరణం బాధాకరమని అన్నారు. రవీందర్ కుటుంబానికి మెపా అండగా ఉంటుందని తెలిపారు.ఎవరికి ఏ అవసరం వచ్చినా నేనున్నానంటూ సహకారం అందించే రవీందర్ కుటుంబానికి ఇలాంటి బాధాకరమైన పరిస్థితి రావడం శోచనీయమన్నారు. నివాళులర్పించిన వారిలో మెపా రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు ముదిరాజ్, రాష్ట్ర కార్యదర్శి నీరటి రాజు ముదిరాజ్,వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి పెండ్యాల కృష్ణ ముదిరాజ్,నర్సంపేట డివిజన్ అధ్యక్షులు పెండ్యాల యాదగిరి ముదిరాజ్, పాండవుల రామకృష్ణ, పాండవుల రామకృష్ణ,దండు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular