ePaper
Tuesday, July 28, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్నూతన వస్త్ర,ఫల పుష్పాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించిన "మెపా" తెలంగాణ రాష్ట్ర కమి

నూతన వస్త్ర,ఫల పుష్పాలంకరణ మహోత్సవ కార్యక్రమానికి హాజరై ఆశీర్వదించిన “మెపా” తెలంగాణ రాష్ట్ర కమి

📰 Generate e-Paper Clip

 

ముదిరాజ్ ల ఇలవేల్పు పెద్దమ్మ తల్లి చిత్రపటం బహుకరణ

పులి దేవేందర్ ముదిరాజ్

జనోదయ, హనుమకొండ,ఫిబ్రవరి 13:

వరంగల్ జిల్లా సంగెం మండలం నల్లబెల్లి గ్రామానికి చెందిన మెపా కమిటీ సభ్యులు నీరటి సతీష్ ముదిరాజ్,మౌనిక ముదిరాజ్ ల కూతురు సనాముదిరాజ్ కు నూతన వస్త్ర,ఫల పుష్పాలంకరణ మహోత్సవ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి మెపా ( ముదిరాజ్ ఎంప్లాయిస్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ తెలంగాణ) వ్యవస్థాపకులు పులి దేవేందర్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు , రాష్ట్ర కార్యదర్శి నీరటి రాజు లతో పాటు ముదిరాజ్ బందువులు ,కుటుంబ సభ్యులు హాజరై సనా ముదిరాజ్ ను ఆశీర్వదించి,పెద్దమ్మ తల్లి చిత్రపటాన్ని బహుకరించారు. అనంతరం పులి దేవేందర్ ముదిరాజ్ మాట్లాడుతూ.. ముదిరాజ్ ల ఆరాధ్య దైవం పెద్దమ్మ తల్లి చిత్రపటాన్ని బహూకరించడం ఆనవాయితీగా చేసుకోవాలని, ఈ సందర్భంగా సనా ను ఆశీర్వదించారు. అనంతరం రాష్ట్ర ఉపాధ్యక్షులు పొన్నం రాజు, నీరటి రాజు లు సంయుక్తంగా మాట్లాడుతూ..
ముదిరాజ్ ల ఆనందాలను, కష్టాలను పంచుకునే వేదికగా మెపా ఉంటుందని ఈ సందర్భంగా బందువుల యోగ క్షేమాలని పంచుకున్నారు.ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యాక్షులు పొన్నం రాజు, రాష్ట్ర కార్యదర్శి నీరటి రాజు, మెపా వ్యవస్థాపక సభ్యులు బోనాల రమేష్ నీరటి బాబు, బోయినీ రాజు, కొక్కు నరసింహస్వామి, పసుల అశోక్,ముత్యం లక్ష్మణ్,ఇప్ప నరసింహస్వామి, బోయినీ తిరుమలేష్, బోడ రంజిత్, ముత్యాల రాజేష్, ఐలయ్య, శంకర్, బోనాల రమేష్, తండా రాజు,కాంతి, బిక్షపతి, శివ, రజినీకాంత్ లతో పాటు కుటుంబ సభ్యులు బంధువులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular