జనోదయ, పెద్దపల్లి సెప్టెంబర్ 11:
దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణనలో బీసీ కులగణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనలో బీసీల కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం 2025 మే 1న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుని ప్రకటించిందని తెలిపారు.
అయితే జనగణన ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ బీసీలకు ప్రత్యేక కులం కాలమ్ లేకుండా కులగణన చేపడితే బీసీ కులాల జనాభా వాస్తవంగా నమోదు కాక నష్టపోయే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి కులానికి ప్రత్యేక యూనిట్ కోడ్ కేటాయించి, కులాల వారీగా జనాభాను ఖచ్చితంగా నమోదు చేయాలని కోరారు.
బీసీల జనాభా ప్రాతిపదికన ప్రభుత్వ సంక్షేమ పథకాలు, రిజర్వేషన్లు, అభివృద్ధి కార్యక్రమాల రూపకల్పనకు అవకాశం ఉంటుందని పేర్కొన్న ఆయన, కులగణనలో ఎలాంటి లోపాలకు తావులేకుండా పారదర్శకంగా, శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.





