బీసీ కులగణన శాస్త్రీయంగా చేపట్టాలి : పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్
జనోదయ, పెద్దపల్లి సెప్టెంబర్ 11: దేశవ్యాప్తంగా చేపడుతున్న జనగణనలో బీసీ కులగణనను శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ, దేశవ్యాప్తంగా నిర్వహించే జనగణనలో బీసీల కులగణన చేపట్టాలని కేంద్ర ప్రభుత్వం 2025 మే 1న కేంద్ర కేబినెట్ నిర్ణయం తీసుకుని ప్రకటించిందని తెలిపారు. అయితే జనగణన ప్రక్రియ ప్రారంభమైనప్పటికీ బీసీలకు ప్రత్యేక కులం కాలమ్ లేకుండా కులగణన చేపడితే బీసీ కులాల జనాభా వాస్తవంగా నమోదు కాక నష్టపోయే...