జనోదయ, 8వ కాలనీ ఆగస్టు 25:
బీజేపీ 8వ కాలనీ మండల శాఖ ఆధ్వర్యంలో కృష్ణవేణి పాఠశాలలో ముందస్తుగా రక్షాబంధన్ వేడుకలు నిర్వహించారు. బీజేవైఎం మండల అధ్యక్షుడు ఐలవేని అనిల్ కుమార్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో నాయకులు విద్యార్థులకు రక్షాబంధన్ ప్రాధాన్యతను వివరించారు.
ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షుడు ఆకుల శశికుమార్, జిల్లా సీనియర్ నాయకుడు మూకిరి రాజు, ఆకుల కుమార్ గౌడ్, లింగం నాయక్, జంజర్ల శ్రీనివాస్, అఖిల్ గౌడ్, శివ, బన్నీ, విక్కీ, పాఠశాల కరస్పాండెంట్ దేవేందర్, సిబ్బంది పాల్గొన్నారు.





