జనోదయ,రామగుండం జూన్ 18:
రామగుండం సింగరేణి బంగ్లాస్ అతిథి గృహంలో రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ దేశాల భూపాల్ను నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్మెంట్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ మహేందర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం కింద ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తూ తప్పుదోవ పట్టిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
హాస్టళ్లు,మున్సిపాలిటీలు,గ్రామపంచాయతీలు,పరిశ్రమలు,పాఠశాలలు తదితర శాఖలకు సంబంధించిన సమాచారంలో చోటుచేసుకుంటున్న అవకతవకలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన మహేందర్ గౌడ్,తప్పుడు సమాచారం అందించిన అధికారులకు సంబంధించిన ఆధారాలు,పత్రాలను సమర్పించారు.
సమర్పించిన వివరాలను పరిశీలించిన కమిషనర్ దేశాల భూపాల్,అవసరమైన చోట సంబంధిత అధికారులకు నోటీసులు జారీ చేసి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.ఫిర్యాదుల్లో పేర్కొన్న అంశాలపై సమగ్ర విచారణ నిర్వహించి వాస్తవాలను వెలికితీసేందుకు చర్యలు చేపడతామని తెలిపారు.
ప్రజలకు పారదర్శకంగా,నిజమైన సమాచారం అందించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని,ఆ బాధ్యతను విస్మరించే వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని ఈ సందర్భంగా స్పష్టమైంది.ఈ కార్యక్రమంలో ఆర్టీఐ రాష్ట్ర కార్యదర్శి కండె సాగర్తో పాటు పలువురు పాల్గొన్నారు.





