ఆర్టీఐ దుర్వినియోగంపై కమిషనర్ దృష్టికి కీలక అంశాలు : సమాచార హక్కు కమిషనర్‌ను కలిసి ఆధారాలు సమర్పించిన మహేందర్ గౌడ్

జనోదయ,రామగుండం జూన్ 18: రామగుండం సింగరేణి బంగ్లాస్ అతిథి గృహంలో రాష్ట్ర సమాచార హక్కు కమిషనర్ దేశాల భూపాల్‌ను నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ జస్టిస్ మూవ్‌మెంట్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు వడ్లకొండ మహేందర్ గౌడ్ మర్యాదపూర్వకంగా కలిసి పలు ప్రజా సమస్యలపై వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సమాచార హక్కు చట్టం కింద ప్రజలకు తప్పుడు సమాచారం అందిస్తూ తప్పుదోవ పట్టిస్తున్న అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. హాస్టళ్లు,మున్సిపాలిటీలు,గ్రామపంచాయతీలు,పరిశ్రమలు,పాఠశాలలు తదితర శాఖలకు సంబంధించిన సమాచారంలో చోటుచేసుకుంటున్న అవకతవకలను కమిషనర్ దృష్టికి తీసుకెళ్లిన...