ePaper
Friday, April 3, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్వరంగల్ లో కొణిదెల సుష్మిత జన్మదిన వేడుకలు

వరంగల్ లో కొణిదెల సుష్మిత జన్మదిన వేడుకలు

📰 Generate e-Paper Clip

 

.కొణిదెల సుష్మిత అభిమాన సంఘం ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు బొట్ల మహర్షి

జనోదయ, హనుమకొండ, మార్చి 11:

కొణిదెల సుష్మిత జన్మదిన వేడుకలు పురస్కరించుకొని మల్లికంబ మనోవికాస కేంద్రం లో అనాథ పిల్లలు,మనోవికాస పిల్లలు, మూగ,చెవిటి, అంధుల పిల్లల మధ్య గణనీయంగా పుట్టిన రోజు వేడుకలు.. వారి చేతుల మీద ది ఏజ్ ఆఫ్ 14 టు 25 ప్రొటెక్ట్ యువర్ లైఫ్ అనే పుస్తకం ఆవిష్కరణ.వరంగల్ రెడ్ క్రాస్ సొసైటీ లో రక్త దాన కార్యక్రమం..
ఈ కార్యక్రమంలో కొణిదెల సుష్మిత అభిమాన సంఘం అధ్యక్షులు బొట్ల మహర్షి మాట్లాడుతూ.. 2001 నుండి కొణిదెల సుష్మిత కి అభిమానిని కాపీ బాయ్ గా పని చేస్తూ మొదటి సారి చూసినప్పుడే తన సంప్రదాయానికి, సింపుల్ సిటీ కి అభిమాని అయ్యా ఒక స్టార్ కూతురు ఇంత సింపుల్ అందరిని ప్రేమ జాలి దయతో చూడటం చిన్న వారిని కూడా మర్యాదగా మాట్లాడటం తో తన మీద అభిమానం పెరిగింది అయితే ఆ అభిమానం ఎలా చూపించాలో ఎలా తెలియపర్చాలో తెలియక నాలో నేను బాధపడేవారిని ఆ రోజులో బర్త్ డే కి బ్యానర్స్ కడితే నన్ను కొడతారు అనుకొని తను ఏదో ఒక రంగం లో సక్సెస్ వరకు ఎదురుచూశా చివరికి సినీ నిర్మాత గా సక్సెస్ అయ్యాక నేను అభిమాన సంఘం ను స్థాపించ చాలామంది అనుమానం చిరంజీవి కి,రామ్ చరణ్ కి , పవన్ కల్యాణ్ వాళ్ళకు అభిమాన సంఘాలు ఉండాలి కానీ సుష్మిత కి అభిమాన సంఘం ఉండటం ఏంటి అని కానీ మంచి మనస్సు తొలిచూపులో కలిగిన భావం నాకు అభిమానిగా మార్చింది..తనను డైరెక్ట్ గా కలవాలని లేదు ఏలాంటి ప్రయత్నం చేయను నాకు సినిమా అవకాశం కోసం నేను చేయటం లేదు ..నాకు టి జి ఆర్ టి సి లో ఉద్యోగి గా,లాయర్ గా నేను సమాజం లో అక్రమ తప్పుడు కేసుల బాధితుల న్యాయ పోరాట సమితి తరుపున నేను 0% క్రైమ్ కోసం నా జీవితం అంకితం కావాలనుకున్న నా కంటు నా పిల్లలు, భార్య,అమ్మ వీళ్ళతో పాటు సంవత్సరానికి ఒక్కసారి కొణిదెల సుష్మిత బర్త్ డే అంతే మార్చి నెలలో నే నా కూతురు,కొడుకు బర్త్ డే ఇదే నెలలో సుష్మిత బర్త్ డే సంవత్సరం ఈ మార్చి నెల కోసం డబ్బులను పోగుచేసుకుంట ఈ మార్చి నెల నాకు నిజమైన పండుగ నెల జీవితంలో అన్ని చూశా …అన్ని అనుభవించ..ప్రశాంతంగా బ్రతికి మరణించాలను కుంటున్న ..ఒక మొదటి చూపులో కలిగిన నా భావం నేను మరణించే వరకు ఉండాలనేది నా భావన … దయచేసి కొణిదెల సుష్మిత పుట్టిన రోజుకు కట్టే బ్యానర్స్, చేసే బర్త్ డే కార్యక్రమాలు మాకు సుష్మిత,సిబ్బంది సహకరించండి మా అభిమానని తీసేయకండి..మా ప్లెక్సీలు తొలగించకండి నేను బ్రతికేది మార్చి నెల కోసం మార్చి 10 తేది కోసం..అని తన జ్ఞాపకము గుర్తుచేసుకున్నాడు..తరాలు మారిన మెగాస్టార్ చిరంజీవి మీద వారి కుటుంబ సభ్యుల మీద ఇలానే ప్రేమ అభిమానం కొనసాగుతుంది తన వారసత్వంగా కొణిదెల సుష్మిత కొనసాగాలని ఆశిస్తూ… నేను మరణించే వరకు కొణిదెల సుష్మిత అభిమానీ గా ఉండి పోత నాకు ఎలాంటి ప్రయోజనాలు అవసరం లేదు తనతో కానీ తన ఫ్యామిలీ తో కానీ ..కేవలం తన మీద ప్రేమ తో అభిమానం తో ఇదంతా చేస్తున్నాం .. మనస్సులో ఉన్న భావన తెలియపర్చడం నాకు గతం లో వీలుకాలేదు అని ఆర్థికంగా స్థిరపడిన తర్వాత నే నా సొంత ఖర్చులతో సంఘం ను నడిపిస్తున్న అని తెలియచేశారు.. నా జీవితం లాయర్ గా అక్రమ తప్పుడు కేసుల బాధితుల న్యాయ పోరాటం కోసం ఉంటుంది అని చెప్పడం జరిగింది..ఈ కార్యక్రమంలో ఒగ్గు కిరణ్ కార్యదర్శి,రాజు కోశాధికారి,సంతోష్ ఉపాధ్యక్షులు,నరేష్ అడ్వకేట్ తదితరులు పాల్గొన్నారు.

 

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular