ePaper
Friday, April 3, 2026
ads
📄 ePaper
Homeకమాన్‌పూర్ఒక్క విరాళం ఒక కుటుంబానికి ఆశాకిరణం

ఒక్క విరాళం ఒక కుటుంబానికి ఆశాకిరణం

📰 Generate e-Paper Clip

🔹దాతలు ముందుకు రావాలని విజ్ఞప్తి

జనోదయ,కమాన్‌పూర్ ఫిబ్రవరి 17:

కమాన్‌పూర్ మండలం రొంపిగుంట గ్రామానికి చెందిన గొర్ల కాపరి పతంగి రమేష్ ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి జీవన్మరణ పోరాటం చేస్తున్నారు. తలకు తీవ్ర గాయం, చేయి, కాలు విరగడంతో ప్రస్తుతం కరీంనగర్‌లోని కెల్విన్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. శస్త్రచికిత్సలు, ఔషధాల కోసం సుమారు రూ.8 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు సూచించారు. కుటుంబానికి ఆధారమైన వ్యక్తి ఆసుపత్రి మంచంపై ఉండటంతో ఇంటి ఆర్థిక పరిస్థితి పూర్తిగా క్షీణించింది. చిన్నారుల చదువు, నిత్యావసరాలు అనిశ్చితిలో పడ్డాయి. ఈ దుస్థితిని గమనించిన రొంపిగుంట 4వ వార్డు సభ్యుడు కొయ్యడ కుమార్ యాదవ్ ముందడుగు వేసి విరాళాల సేకరణ ప్రారంభించారు. స్థానిక ప్రజలు,ప్రజాప్రతినిధులు స్పందించి రూ. 31,010 సేకరించి కుటుంబానికి అందజేశారు. అయితే ఇంకా భారీగా నిధులు అవసరమని గ్రామస్థులు తెలిపారు. దాతృత్వం కలిగిన వారు ఫోన్‌పే, గూగుల్‌పే ద్వారా 9550395852 నంబర్‌కు విరాళాలు పంపి ఈ కుటుంబానికి చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular