ePaper
Friday, April 3, 2026
ads
📄 ePaper
Homeకమాన్‌పూర్మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా అన్నదాన కార్యక్రమం

మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా అన్నదాన కార్యక్రమం

📰 Generate e-Paper Clip

జనోదయ,కమాన్‌పూర్ ఫిబ్రవరి 16:

మహాశివరాత్రి జాగరణ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం కమాన్‌పూర్ మండల కేంద్రంలోని శ్రీ చంద్రమౌళీశ్వర ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం మధ్యాహ్నం ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని కోలేటి నాగభూషణం ఆధ్వర్యంలో నిర్వహించారు.కమాన్‌పూర్ మండల ఆర్య,వైశ్య సంఘం అధ్యక్షుడు తాటిపెల్లి శ్రీనివాస్,సభ్యులు కార్యక్రమంలో పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అన్నదానం చేసిన కుటుంబం సేవాభావంతో ముందుకొచ్చి భక్తులకు ప్రసాదాన్ని అందించడంతో భక్తులు కృతజ్ఞతలు తెలిపారు.

‘అన్నదానం మహాదానం’ అన్న నానుడిని సాక్షాత్కారం చేస్తూ,భక్తులకు భోజన ప్రసాదం అందించడం ద్వారా సమాజంలో ఐక్యత,సేవా స్పూర్తిని పెంపొందించారని పలువురు అభిప్రాయపడ్డారు.ఈ కార్యక్రమంలో కమాన్‌పూర్ గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్,ఆర్య,వైశ్య సంఘం సభ్యులు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని శివుని ఆశీర్వాదం పొందారు.అన్నదానం చేసిన కుటుంబానికి దేవుడు మరింత ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు ప్రసాదించాలని భక్తులు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular