మహాశివరాత్రి సందర్భంగా ఘనంగా అన్నదాన కార్యక్రమం
జనోదయ,కమాన్‌పూర్ ఫిబ్రవరి 16: మహాశివరాత్రి జాగరణ పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం కమాన్‌పూర్ మండల కేంద్రంలోని శ్రీ చంద్రమౌళీశ్వర ఆలయంలో స్వామివారి కళ్యాణోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని సోమవారం మధ్యాహ్నం ఆలయంలో అన్నదాన కార్యక్రమాన్ని కోలేటి నాగభూషణం ఆధ్వర్యంలో నిర్వహించారు.కమాన్‌పూర్ మండల ఆర్య,వైశ్య సంఘం అధ్యక్షుడు తాటిపెల్లి శ్రీనివాస్,సభ్యులు కార్యక్రమంలో పాల్గొని సేవా కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.అన్నదానం చేసిన కుటుంబం సేవాభావంతో ముందుకొచ్చి భక్తులకు ప్రసాదాన్ని అందించడంతో భక్తులు కృతజ్ఞతలు తెలిపారు. ‘అన్నదానం మహాదానం’ అన్న నానుడిని సాక్షాత్కారం చేస్తూ,భక్తులకు భోజన...