ePaper
Sunday, April 5, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్జూలపల్లిలో ఘనంగా మార్కెట్ వారసంత ప్రారంభం

జూలపల్లిలో ఘనంగా మార్కెట్ వారసంత ప్రారంభం

📰 Generate e-Paper Clip

జనోదయ,కమాన్‌పూర్/జూలపల్లి ఫిబ్రవరి 4:

కమాన్‌పూర్ మండలంలోని జూలపల్లి గ్రామంలో మంగళవారం వారసంత (మార్కెట్)ను గ్రామ సర్పంచ్ పోలుదాసరి వనిత–సాయికుమార్లు ఘనంగా ప్రారంభించారు. గ్రామ ఆర్థిక చైతన్యానికి వారసంత కీలకమని పేర్కొంటూ, రైతులు-వ్యాపారులకు ఇది ఉపాధి అవకాశాలు పెంచుతుందని వారు అన్నారు.

ఈ కార్యక్రమంలో కమాన్‌పూర్ మండల ఎంపీఓ సౌమ్య, వార్డు సభ్యులు ఇరుగురాల రాజు, ఇరుగురాల జీవనజ్యోతి, సాగర్ల రమ, బొల్లంపల్లి సంతోష్ కుమార్, పంచాయతీ కార్యదర్శి అంబటి శంకర్ తో పాటు గ్రామ పెద్దలు, రాజకీయ నాయకులు, యువకులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

గ్రామీణ అవసరాలను ఒకే చోట అందించే వారసంతతో జూలపల్లిలో వ్యాపార సందడి మొదలైందని, వినియోగదారులకు సౌకర్యం పెరుగుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. ఈ మార్కెట్ గ్రామాభివృద్ధికి దోహదపడుతుందని పలువురు అభిప్రాయపడ్డారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular