📰 Generate e-Paper Clip

 

గంగాధర | ఫిబ్రవరి  03:

గంగాధర మండలంలోని గర్షకుర్తి గ్రామం ప్రధాన కూడలిలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహ నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల కోసం చొప్పదండి నియోజకవర్గానికి చెందిన సామాజికవేత్త తుడి లచ్చన్న రజక సంఘ సభ్యులకు రూ.20,000 ఆర్థిక సహాయం అందజేశారు.

ఈ సందర్భంగా తుడి లచ్చన్న మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం రజాకార్లకు ఎదురు నిలిచిన ధైర్యశాలి వీరవనితగా చాకలి ఐలమ్మ చరిత్రలో నిలిచారని గుర్తు చేశారు. ఐలమ్మ పోరాటం నేటి తరాలకు స్ఫూర్తిదాయకమని, ఆమె త్యాగాలను స్మరించుకోవాల్సిన బాధ్యత సమాజంపై ఉందన్నారు.

ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చిందం ఆంజనేయులు, ఉపసర్పంచ్ దాది లావణ్య–హరీష్, మాజీ ఎంపీటీసీ తడిగొప్పుల రమేష్, రజక సంఘ అధ్యక్షులు లింగంపల్లి అనిల్, లక్ష్మణ్, అఖిల్, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here