చాకలి ఐలమ్మ విగ్రహ అభివృద్ధికి రూ.20వేల ఆర్థిక సహాయం

  గంగాధర | ఫిబ్రవరి  03: గంగాధర మండలంలోని గర్షకుర్తి గ్రామం ప్రధాన కూడలిలో తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహ నిర్మాణం, అభివృద్ధి కార్యక్రమాల కోసం చొప్పదండి నియోజకవర్గానికి చెందిన సామాజికవేత్త తుడి లచ్చన్న రజక సంఘ సభ్యులకు రూ.20,000 ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా తుడి లచ్చన్న మాట్లాడుతూ తెలంగాణ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం నిజాం రజాకార్లకు ఎదురు నిలిచిన ధైర్యశాలి వీరవనితగా చాకలి ఐలమ్మ చరిత్రలో నిలిచారని గుర్తు...