ePaper
Monday, May 25, 2026
ads
📄 ePaper
Homeకరీంనగర్గంగాధరకాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు: కాంగ్రెస్ ప్రభుత్వంపై మేచినేని నవీన్‌రావు ఫైర్

కాళేశ్వరం కమిషన్ నివేదికపై హైకోర్టు తీర్పు: కాంగ్రెస్ ప్రభుత్వంపై మేచినేని నవీన్‌రావు ఫైర్

📰 Generate e-Paper Clip

 

గంగాధర, ఏప్రిల్ 24 (జనోదయ):

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పి.సి.ఘోష్ కమిషన్ నివేదికకు సంబంధించి హైకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో గంగాధర మండల బీఆర్ఎస్ అధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సెక్షన్ 8(B)ను పూర్తిగా విస్మరించి, సంబంధిత వ్యక్తుల నుంచి వివరణ తీసుకోకుండా ఏకపక్షంగా నివేదిక ఇవ్వడం పూర్తిగా చట్టవిరుద్ధమని అన్నారు. హైకోర్టు చేసిన కీలక వ్యాఖ్యలతో ఈ విషయం స్పష్టమైందని పేర్కొన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా లక్షల ఎకరాల భూమి సాగులోకి వచ్చి, తెలంగాణ రాష్ట్రం నేడు దేశానికి అన్నం పెట్టే స్థాయికి ఎదిగిందని నవీన్‌రావు తెలిపారు. అలాంటి ప్రాజెక్టును రాజకీయ ప్రయోజనాల కోసం దెబ్బతీయడం దురదృష్టకరమని విమర్శించారు.

మేడిగడ్డ వద్ద రెండు పిల్లర్లు కుంగిన ఘటనను భూతద్దంలో చూపిస్తూ, మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు కూలిపోయిందని ప్రజలను నమ్మించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం విష ప్రచారం చేసిందని ఆరోపించారు. ఇది కేవలం మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బదనం చేయడానికి చేసిన కుట్ర మాత్రమేనని అన్నారు.

హైకోర్టులో ఘోష్ కమిషన్ నివేదికపై దాఖలైన పిటిషన్లపై వచ్చిన తీర్పుతో అయినా కాంగ్రెస్ ప్రభుత్వం బుద్ధి తెచ్చుకుని పాలనపై దృష్టి పెట్టాలని హితవు పలికారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటివరకు అభివృద్ధి కంటే విమర్శలకే ప్రాధాన్యం ఇచ్చిందని మండిపడ్డారు.

ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కాలక్షేపం చేస్తున్నారని, “దొంగ హామీలు” ఇచ్చి అధికారంలోకి వచ్చారని విమర్శించారు. ప్రస్తుతం గ్రామ స్థాయిలో ప్రజలు కాంగ్రెస్ ప్రజాప్రతినిధులను నిలదీస్తున్నారని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీపై విశ్వాసం కోల్పోయిన సీనియర్ నాయకులు సైతం బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు “రేవంత్ రెడ్డి పోవాలి – కేసీఆర్ రావాలి” అని కోరుకుంటున్నారని అన్నారు. తెలంగాణ అభివృద్ధి, రైతుల సంక్షేమం కోసం కేసీఆర్ నాయకత్వమే అవసరమని ప్రజలు భావిస్తున్నారని పేర్కొన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా వైఫల్యానికి గురైందని, ఒకప్పుడు అభివృద్ధిలో నంబర్ వన్‌గా ఉన్న తెలంగాణను తిరోగమన దిశలోకి తీసుకెళ్తోందని విమర్శించారు. ఇప్పటికైనా ప్రభుత్వం మార్గం మార్చుకుని అభివృద్ధిపై దృష్టి సారించాలని మేచినేని నవీన్‌రావు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular