ePaper
Friday, September 11, 2026
ads
📄 ePaper
Homeకమాన్‌పూర్కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎస్ ఎస్ అన్వర్‌.. సర్పంచుల ఆత్మీయ సత్కారం

కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా ఎస్ ఎస్ అన్వర్‌.. సర్పంచుల ఆత్మీయ సత్కారం

📰 Generate e-Paper Clip

జనోదయ,కమాన్‌పూర్‌ సెప్టెంబర్‌ 4: 

కమాన్‌పూర్‌ మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడిగా ఎస్‌.ఎస్‌. అన్వర్‌ మరోసారి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మండలంలోని సర్పంచులు అన్వర్‌ను శాలువాతో ఘనంగా సత్కరించి అభినందనలు తెలిపారు.

మరోసారి పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించిన అధిష్ఠానానికి అన్వర్‌ కృతజ్ఞతలు తెలిపారు. తనపై పార్టీ ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని పేర్కొన్నారు. నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుంటూ కాంగ్రెస్‌ పార్టీని గ్రామస్థాయి నుంచి మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తానన్నారు. పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడంతోపాటు ప్రజా సమస్యల పరిష్కారానికి నిరంతరం పనిచేస్తానని తెలిపారు. పార్టీ శ్రేణులంతా ఐక్యంగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో కమాన్‌పూర్‌ సర్పంచ్‌, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షులు రంగు సత్యనారాయణ గౌడ్‌, రొంపికుంట సర్పంచ్‌ గుమ్మడి శ్రీనివాస్‌, నాగారం సర్పంచ్‌ పొనగంటి కుమార్‌, గొల్లపల్లి సర్పంచ్‌ శిలారపు మల్లయ్య, పెరపల్లి సర్పంచ్ బొంగోని సదయ్య గౌడ్, కాంగ్రెస్‌ నాయకులు మల్యాల మహేష్‌ గౌడ్‌, పంజా సాయిరాం, బంగారి మహేష్, సయ్యద్ ఇక్బాల్, యూసఫ్‌ లల్లు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular