ePaper
Friday, September 11, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్గంగాధరలో సైబర్ జాగృతి దివస్‌

గంగాధరలో సైబర్ జాగృతి దివస్‌

📰 Generate e-Paper Clip

గంగాధర, సెప్టెంబర్ 02:

గంగాధర ఎంజేపీఎస్ బాలుర వసతి గృహంలో ఎస్‌ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో సైబర్ జాగృతి దివస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు డిజిటల్‌ చెల్లింపులు, డిజిటల్‌ భద్రత, ఆన్‌లైన్‌ షాపింగ్‌ మోసాలు, పెట్టుబడి మోసాలపై అవగాహన కల్పించారు.

ఫేక్‌ ఆఫర్లు, డిస్కౌంట్లు, బహుమతులు, క్యాష్‌బ్యాక్‌ పేరుతో సైబర్‌ నేరగాళ్లు ఫోన్‌ కాల్స్‌, ఎస్‌ఎంఎస్‌, వాట్సాప్‌, సోషల్‌ మీడియా ద్వారా మోసాలకు పాల్పడుతున్నారని ఎస్‌ఐ వంశీకృష్ణ వివరించారు. అనుమానాస్పద లింకులను క్లిక్‌ చేయవద్దని, గుర్తుతెలియని క్యూఆర్‌ కోడ్‌లను స్కాన్‌ చేయవద్దని సూచించారు.

అలాగే ఓటీపీ, పిన్‌, పాస్‌వర్డ్‌లు, బ్యాంకు ఖాతా వివరాలను ఎవరికీ వెల్లడించవద్దని సూచించారు. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేయాలని అవగాహన కల్పించారు.

కార్యక్రమంలో గంగాధర పోలీస్ కానిస్టేబుల్ కృష్ణ, రాజేందర్, రాజిరెడ్డి, స్కూల్ ప్రిన్సిపాల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular