ePaper
Saturday, September 12, 2026
ads
📄 ePaper
Homeకమాన్‌పూర్సర్వాయి పాపన్న గౌడ్‌కు ఘన నివాళి

సర్వాయి పాపన్న గౌడ్‌కు ఘన నివాళి

📰 Generate e-Paper Clip

జనోదయ,కమాన్‌పూర్ ఆగస్టు 18:

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 376వ జయంతిని పురస్కరించుకుని కమాన్‌పూర్ గ్రామ గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా వేడుకలు నిర్వహించారు. గౌడ సంఘం అధ్యక్షుడు నగునూరి నరసయ్య గౌడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో సర్వాయి పాపన్న గౌడ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా పాల్గొన్న నాయకులు సర్వాయి పాపన్న గౌడ్ చేసిన పోరాటాలను స్మరించుకున్నారు. ఆయన ఆశయాలను నేటి తరానికి తెలియజేయడంతో పాటు సమాజ అభివృద్ధికి ఐక్యంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు.

కార్యక్రమంలో కమాన్‌పూర్ గ్రామ సర్పంచ్ రంగు సత్యనారాయణ గౌడ్, మాజీ ఎంపీపీ మల్యాల రాంచంద్రం గౌడ్, పెద్దపల్లి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు నల్లవెల్లి శంకర్, గౌడ సంఘం డైరెక్టర్లు, సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular