ePaper
Sunday, September 13, 2026
ads
📄 ePaper
Homeఎడిటోరియల్శ్రీ వైష్ణవి హైస్కూల్ సమ్మర్ క్యాంప్‌లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్

శ్రీ వైష్ణవి హైస్కూల్ సమ్మర్ క్యాంప్‌లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్

📰 Generate e-Paper Clip

 

 

జనోదయ, పెగడపల్లి జూన్ 9:

పెగడపల్లి మండలంలోని శ్రీ వైష్ణవి హైస్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించిన సమ్మర్ క్యాంప్‌లో భాగంగా గత 45 రోజులుగా కరాటే ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కొనసాగింది. క్యాస రాజశేఖర్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచి, ఓకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ వసంత్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌లో పాల్గొన్నారు.

ఈ పరీక్షలో మొత్తం 27 మంది విద్యార్థులు పాల్గొనగా, నలుగురు విద్యార్థులు **సీనియర్ బ్రౌన్ బెల్ట్** సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు.

కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెగడపల్లి సర్పంచ్ ఓరుగల అరుణ-శ్రీనివాస్, వెంగళాయిపేట సర్పంచ్ గోపాల్, ఉప సర్పంచ్ కుంచె రాజేందర్, వార్డు సభ్యుడు రాజశేఖర్ గౌడ్ హాజరై విద్యార్థులను అభినందించారు.

అనంతరం మాస్టర్ గాజుల రాకేష్, వినయ్, గురుప్రసాద్ తదితరులు విద్యార్థులను ప్రోత్సహిస్తూ బెల్టులు అందజేశారు. విద్యార్థుల క్రమశిక్షణ, పట్టుదల, ప్రతిభను ప్రశంసిస్తూ భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -ads

Most Popular