శ్రీ వైష్ణవి హైస్కూల్ సమ్మర్ క్యాంప్‌లో కరాటే బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్
జనోదయ, పెగడపల్లి జూన్ 9: పెగడపల్లి మండలంలోని శ్రీ వైష్ణవి హైస్కూల్ గ్రౌండ్‌లో నిర్వహించిన సమ్మర్ క్యాంప్‌లో భాగంగా గత 45 రోజులుగా కరాటే ప్రత్యేక శిక్షణ కార్యక్రమం కొనసాగింది. క్యాస రాజశేఖర్ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచి, ఓకినోవా మార్షల్ ఆర్ట్స్ అకాడమీ చీఫ్ వసంత్‌కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన బెల్ట్ గ్రేడింగ్ టెస్ట్‌లో పాల్గొన్నారు. ఈ పరీక్షలో మొత్తం 27 మంది విద్యార్థులు పాల్గొనగా, నలుగురు విద్యార్థులు **సీనియర్ బ్రౌన్ బెల్ట్** సాధించి ప్రత్యేక గుర్తింపు పొందారు....